దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ తుంగతుర్తిలో నిరాహార దీక్ష

దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ తుంగతుర్తిలో నిరాహార దీక్ష

ముద్ర .తిరుమలగిరి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టాను రాష్ట్ర ముఖ్యమంత్రి  బహిర్గతం చేయాలనివారిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాది ఆదేశాల మేరకు మంగళ వారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగానే  తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి
 ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ  మాట్లాడుతూ అత్యంత పేదరికంలో ఉన్న దళితల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం కొటేషన్ల పేరుతో మధ్యవర్తుల ప్రమేయంతో లక్షలాది రూపాయలను కొల్ల గొట్టి దుర్వినియోగం చేయడం అంటే ఇది దళితుల్ని దగా చేయడమేనని ఆరోపించారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుండి తీసుకున్న డబ్బులు వెంటనే ప్రతి లబ్ధిదారునికి వాపసివ్వాలని డిమాండ్ చేశారు.ఈ దళిత బంధు పథకంలో 2లక్షల రూపాయల నుండి 3లక్షల వరకు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లను వారి చిట్టాను ముఖ్యమంత్రి  బహిర్గతం చేయాలని.డిమాండ్ చేశారుఈ దళిత బందు పథకములో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈ పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కట్లు ఇవ్వకూడదని. వారిని అనహరులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ దళిత బందు పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళితునికీ అంద జేయలని మధ్య వర్తుల ప్రమోయం లేకుండా నేరుగా వారి అకొంట్లో వేయాలని డిమాండు చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు హాజరి శ్రీనివాస్ బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాక సాయి బాబా మద్దతు తెలిపారుఈ కార్యక్రమంలో.పాల్వాయి బాలయ్య మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి.కందుకూరి శ్రీను మాదిగ ఎం ఎస్ పి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు.పోలేపాకు అంజయ్య మాదిగ ఎంఎస్సీ తుంగతుర్తి మండల సీనియర్ నాయకులు.కొండగడపల శ్రీను మాదిగ ఎంఎస్పి తుంగతుర్తి మండల ఇంచార్జ్పడిశాల ప్రశాంత్ తిరుమలగిరి మండలనాయకులు. పాల్వాయి పరుశరాములు ఎమ్మెస్పీ నూతనకల్ మండల ఇన్చార్జి చెడుపాక గంగరాజు ఎమ్మార్పీఎస్ తుంగతుర్తి మండల సీనియర్ నాయకులు. రాంపాక సత్యం ఎం ఎస్ పి మద్దిరాల మండల కమిటీ ఇంచార్జ్ కొండగడపల శ్రీకాంత్. కోడిశాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.