పొంగులేటి వద్దకు టిడిపి నేతలు

పొంగులేటి వద్దకు టిడిపి నేతలు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, తోటకూరి శివయ్య శనివారం పొంగులేటి నివాసానికి వెళ్లి కలిశారు. రెండు రోజుల కిందట రాష్ట్ర బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ బృందం వచ్చి పొంగులేటితో సమావేశం అయిన విషయం తెలిసిందే. తమ పార్టీలోకి రావాలని ఖమ్మం టిడిపి నేతలు వెళ్లి పొంగులేటిని కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, రాజకీయ శూన్యతని తెలంగాణ తెలుగుదేశం బలోపేతం కావడం ద్వారా రాజకీయ పునరేకికరణ జరిగే అవకాశం ఉన్నదని చర్చించినట్లు తెలిసింది. దాంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలు కూడా చర్చ కి  వచ్చినట్లు తెలిసింది.
తదుపరి స్థాయిలో టీటీడీపీ రాష్ట్ర నాయకత్వం వచ్చి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.