కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అడ్డుకున్న పోలీసులు 

కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అడ్డుకున్న పోలీసులు 

ఖమ్మం, ముద్ర: బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనo సందర్భంగా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో సిలిండర్ పేలిన సంఘటనలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి హైదరాబాద్ నుంచి కారేపల్లి బయలుదేరారు. మార్గమధ్యలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చీమలపాడు గ్రామం వెళ్లొద్దని సూచించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటల నుంచి ఈ నిరసన కొనసాగుతుంది. 
ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది