కాంగ్రెస్ నేత రేణుక చౌదరి పర్యటనలో అపశృతి

కాంగ్రెస్ నేత రేణుక చౌదరి పర్యటనలో అపశృతి

 కార్పొరేటర్ భర్తకు తీవ్ర గాయాలు

వైరా, ముద్ర: మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు ఇతర నేతలు హాజరయ్యారు సభకు ముందు వైరా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రేణుక చౌదరి ట్రాక్టర్ నడిపారు.

కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేణుక నడుపుతున్న ట్రాక్టర్ కింద ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ వహీదా భర్త కాంగ్రెస్ నాయకులు ముస్తఫా కాలు మీదకి ఎక్కటంతో గాయపడ్డడు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు హుటాహుటిన అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముస్తఫా కాలుకు తీవ్ర గాయం అయింది.