ఆకట్టుకుంటున్న సురభి నాటికలు

ఆకట్టుకుంటున్న సురభి నాటికలు
Impressive dramas of Surabhi

ముద్ర, కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో శ్రీ వినాయకనాట్యమండలి, సురభి నాటకోత్సవాలు   
సుదీర్గ 138 సంవత్సరాల చరిత్రగలిగిన శ్రీవినాయకనాట్యమండలి,సురభి 8 తరాల నుండి వృత్తి, ప్రవృత్తి, నాటకరంగాన్ని నమ్ముకొన్న కుటుంబం.   కళారంగానికి సేవలందించుచున్న సరభి కళాకారుల  ప్రదర్శనలతో ప్రజల మంత్రముగ్ధులను చేయుచూ నాటి నుంచి  నేటితరం ప్రేక్షకులను మెప్పించుచూ ప్రదర్శన నిర్వహించారు. రంగస్ధలంపై, రధాలు నడవడం, వర్షం కురవడం, మంటలు లేవడం, గాలిలో  ఆయుధాలు పోరాటం, ఘటోత్కజుడు, నోట లడ్డూలు పడటం, శశిరేఖ, తల్పం ఆకాశమార్గమున వెల్లడం, సూర్యస్తమయం, పున్నమ్మ విహరించడం, మకరితో యుద్ధం, భయంకర బూతాల, విన్యాసం, పక్షిపై, బాలవర్ధిరాజువెల్లడం, జింకలు, పులులు, విహరించే, మరెన్నో అధ్బుతసన్నివేశాలుతో, కనులు విరుమెట్లు గోలిపే సెట్టింగులతో  ఆసాంతం ప్రదర్శన జరిగింది.  వైరు వర్కులు, ట్రిక్, సీనులతో,  45 మంది కళాకారులతో, సినిమాలను మరపించే చిద్విలాసములతో, పండిత, పామరులను మెప్పింపగల నాటకప్రదర్శనలు ప్రేక్షకులకు అలరించాయి.