వివాదంలో బండి కొడుకు

వివాదంలో బండి కొడుకు
bandi son controversy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు ఓ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. బండి సంజయ్‌ కుమారుడి పేరు సాయి భగీరథ్‌. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న  సాయి భగీరధ్‌.. ఓ జూనియర్‌ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. అయితే ఈ దాడి ర్యాగింగ్‌ కారణంగా చేశారా.. మరో వివాదమా అన్నదానిపై స్పష్టత లేదు.  మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.వీడియోలో ఉన్న బండి సంజయ్‌ కుమారుడు కావడంతో ఈ అంశం రాజకీయ వివాదమయింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఈ వీడియోను సోషల్‌ విూడియాలో వైరల్‌ చేశారు.  బండి సంజయ్‌ కుమారుడు ర్యాగింగ్‌ పేరుతో దాడి చేశారని చర్యలు తీసుకుంటారా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలను ట్యాగ్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే దాడికి గురైన యువకుడి వీడియో అంటూ.. మరో వీడియోను బీజేపీ మద్దతుదారులు వైరల్‌ చేస్తున్నారు. తానే ఓ అమ్మాయిని ఏడిపించానని..అందుకే బండి సంజయ్‌ కొడుకు కొట్టాడని... ఆ యువకుడు చెప్పుకున్నాడు. ఈ రెండు వీడియోలతో అటు బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్‌ విూడియాలో హాట్‌ టాపిక్‌ గామారింది. 

కౌంటర్‌ ఇచ్చినసంజయ్‌
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థిపై గతంలో దాడి చేసిన వీడియో వైరల్‌ కావడంతో పలు సెక్షన్ల కింద కేసు సైతం నమోదయ్యింది. ఈ వివాదంపై ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ లో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఎవరూ చట్టానికి అతీతులు కాదు అన్నారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. పిల్లలను రాజకీయాల కోసం వాడుకోవద్దు అని సూచించారు.కేసీఆర్‌ అంత చీటింగ్‌ తెలివితేటలు లేవన్న బండి సంజయ్‌, పిల్లల విషయాన్ని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు పై ట్రోలింగ్‌ జరిగిన సమయంలో తాను ఖండిరచానని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం, కేసులు పెట్టించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని కేసీఆర్‌ ను ప్రశ్నించారు. యాదాద్రి విషయాన్ని ప్రజలు మరిచిపోవాలని, అరాచకాలను పక్కదోవ పట్టించి రాజకీయాలు చేయడం కంటే తాగి ఫాం హౌజ్‌ లో పడుకోవడం బెటర్‌ అన్నారు. 

చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి కేసీఆర్‌ అని ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గతంలో ఉద్యమం పేరుతో వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు మరో ముగ్గురు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పిల్లలు ఈరోజు కోట్లాడుతారు రేపు మళ్లీ వాళ్లే కలిసిపోయి ఉంటారని, అన్యాయంగా తన కుమారుడిపై సీఎం కేసీఆర్‌ కేసులు నమోదు చేయించారంటూ మండిపడ్డారు. నా కుమారుడు విూలాగ స్కూళ్లలో మందు పోయించడం, చిన్నారులకు మందు పంపిణీ చేయించడం లాంటివి చేసి వివాదంలో చిక్కుకోలేదన్నారు. చట్టాలను నమ్ముకున్న వ్యక్తినని, ఇది కరెక్టా అని కుటుంబసభ్యులను అడిగి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. కాలేజీ మేనేజ్‌ మెంట్‌ ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకుందా, తల్లిదండ్రులకు సమాచారం అందించడం, కౌన్సెలింగ్‌ ఇవ్వడం లాంటివి ఎందుకు చేయలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. పిల్లల్ని జైలుకు పంపడం తప్ప, అమాయక యువతులు, ఆడవారిని కాపాడం చేతకాని వ్యక్తి అంటూ కేసీఆర్‌ పై మండిపడ్డారు.