ముఖ్యమంత్రి పర్యటన.. ప్రతిపక్షాల అరెస్టులు

ముఖ్యమంత్రి పర్యటన.. ప్రతిపక్షాల అరెస్టులు

ఖమ్మం, ముద్ర ప్రతినిధి: బిఆర్ఎస్ బహిరంగ సభ, ముఖ్యమంత్రి కెసిఆర్ బుదవారం పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలను మంగళవారం రాత్రి నుంచే పోలీసులు అరెస్టులు ప్రారంభించగా బుధవారం ఉదయం వరకు అరెస్టుల పర్వం అధికమైంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో కాంగ్రెస్, బిజెపి, ఎన్డీ, సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా, నాయకులు కార్యకర్తలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. అక్రమ అరెస్టులను ప్రతిపక్ష నేతల ఖండించారు.