కాంగ్రెస్ ఆఫీస్ వద్దకు భజరంగ్ దళ్ శ్రేణులు అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ ఆఫీస్ వద్దకు భజరంగ్ దళ్ శ్రేణులు అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: కర్నాటకలో అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట హనుమాన్ చాలీసా తో నిరసన చేపట్టాలని బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గట్టయ్య సెంటర్ బిజెపి కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా సిద్దమయెందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా ఇద్దరు భజరంగ్ దళ్ శ్రేణులు సిటీ బస్ స్టాండ్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయ వద్దకు చేరుకున్నారు. అప్పుడే రాష్ట్ర కిసాన్ సెల్ కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ అనంతరం కలెక్టరేట్ వెళ్లేందుకు బయలుదేరిందుకు సిద్దమయ్యారు. భజరంగ్ దళ్ శ్రేణులను చూసి యువజన కాంగ్రెస్ నాయకులు వారిపై దాడి చేసేందుకు వెళ్లారు. బందోబస్తుగా సిద్ధంగా ఉన్న పోలీసులు ఇరువర్గాలను నిలువరించారు.  భజరంగ్ దళ్ శ్రేణులను రెండో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, పోట్ల నాగేశ్వరావు, నరేందర్, రవి కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నేతల అరెస్టు:  కాంగ్రెస్ కార్యాలయం వద్దకు రాకుండా పోలీసులు ముందస్తుగా బిజెపి నేతలను వారి కార్యాలయం వద్ద అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్, చావా కిరణ్, డాక్టర్ శీలం పాపారావు , విద్యాసాగర్ రావు , రుద్ర ప్రదీప్ , జ్వాలా గౌడ్,   మంద సరస్వతి  నల్ల మాస సుగుణ , ఆ చంటి కోటేశ్వరరావు,  జంపన్న ప్రసాదరావు, కుంకుమళ్ళ మృత్యుంజయరావు తదితరులు ఉన్నారు.