కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు - బీఅర్ఎస్ లో చేరిన సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు - బీఅర్ఎస్ లో చేరిన సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: కాంగ్రెస్ ను నమ్మి ఆగం అయ్యాం... తాండూరులో కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి సముచిత స్థానం లభించడం లేదు, మీరు కాంగ్రెస్ పార్టీ లో చేరి మాలా మోసపోకండి అని తాండూరు మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు, 2 వ వార్డు కాంగ్రెస్ నాయకులు అన్నారు. తాండూరు పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో తిరిగి బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ.. బయటి నుండి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ని నమ్మితే మీ రాజకీయ జీవతం సమాప్తం అవుతుందని వారు జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని అనతి కాలంలోనే తాండూరు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వారు అన్నారు. తాండూర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా శ్రమిస్తామని వారు తెలిపారు. దాదాపు 100 మంది వరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరుకున్నారు. వారికీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.