సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

ముద్ర ప్రతినిధి భువనగిరి : తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వం  ప్రధాన కారణమని భువనగిరి మున్సిపల్ చైర్మన్  ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉత్సవాలు భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  వైస్ చైర్పర్సన్ చింతల కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ బి.నాగిరెడ్డి, వార్డు సభ్యుల జిట్టా వేణుగోపాల్ రెడ్డి,  బానోత్ వెంకట్ నర్సింగ్ నాయక్, అధికారులు, నాయకులు తుమ్మల పాండు, సిబ్బంది పాల్గొన్నారు.