పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన  ఆంజనేయులు

పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన  ఆంజనేయులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో నాణ్యత లోపం లేకుండా  చూడాలని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. మంగళవారం 
భువనగిరి పట్టణంలోని స్థానిక 28వ వార్డులో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో చేపడుతున్న సిసి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం పరిశీలించినట్లు ఆయన తెలిపారు.