పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాజకీయ శంఖారావం గోడ ప్రతుల ఆవిష్కరణ..

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాజకీయ శంఖారావం గోడ ప్రతుల ఆవిష్కరణ..

ఆలేరు (ముద్ర న్యూస్): పద్మశాలిలకు రాజకీయ పదవులలో సముచిత స్థానం కోసం సెప్టెంబర్ 3న హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే పద్మశాలి రాజకీయ శంఖారావం గోడ ప్రతులను గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు బింగి నరసింహులు ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం నాయకులకు కలిసి హోమం. అభిషేక కార్యక్రమం నిర్వహించారు. చట్టసభలలో పద్మశాలి లకు రావలసిన వాటాను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీలకు చట్ట సభలలో రాజకీయ వాటకై సెప్టెంబర్ మూడున జరిగే రాజకీయ శంఖారావ సభకు పద్మశాలీలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బేతి రాములు. పాలేరు వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశికంటి శ్రీనివాస్. ఆలేరు మాజీ ఇంచార్జి సర్పంచ్ దాసి సంతోష్. జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చింతకింది మురహరి. శ్రీ కళాతరంగిని వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మహాత్మా గాంధీ విగ్రహ వ్యవస్థాపకులు చింతకింది రామానుజం. బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ తో పాటు పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..