సంక్షేమ పథకాలు పేదలందరికీ అందించాలి- సిపిఐ

సంక్షేమ పథకాలు పేదలందరికీ అందించాలి- సిపిఐ


ఆత్మకూర్( ఎం )ముద్ర : రాష్ట్ర ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పేదలందరికీ అందించాలని సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు మాట్లాడుతూ ప్రభుత్వ అమలు చేస్తున్న దళిత బంధు, బీసీ బందు, పెన్షన్లు ,గృహలక్ష్మి , రుణమాఫీ పథకాలు పేదలందరికీ సక్రమంగా, సజావుగా అందించాలని ఆయన కోరారు. దళిత బంధు మండలంలోని దళితులందరికీ అందజేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం అమలు చేస్తామన్న రుణమాఫీ పథకం ద్వారా కొంతమంది రైతులకే మాఫీ వర్తించిందని, మిగతా రైతులందరికీ మాపీ చేయాలని కోరారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఎంపిక చేసే లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని కోరారు. సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా గ్రామంలోని పేదల అందరికీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ శేఖర్ కు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జెల్ది రాములు, మారుపాక వెంకటేష్ ,సోలిపురం లింగారెడ్డి, సుల్తాన్ పురుషోత్తం, కిష్టయ్య, స్వామి, యాదగిరి, జన్నయ్య తదితరులు పాల్గొన్నారు.