ఆడబిడ్డలకు కొండంత  అండ కేసిఆర్

ఆడబిడ్డలకు కొండంత  అండ కేసిఆర్
  • ముత్తారంలో దసరా చీరల పంపిణీలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య

ముద్ర, ముత్తారం:- ఆడబిడ్డలకు కొండంత అండ మన సీఎం కేసీఆర్ అని ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న దసరా పండుగా చీరలను ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దసరా సద్దుల బతుకమ్మ పండుగలకు కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీగా వస్తుందని,  తెలంగాణలో ఒక్క ఆడబిడ్డ కూడా ఇబ్బంది పడవద్దని సీఎం కేసీఆర్ ఉచితంగా చీరలు ఆడబిడ్డలకు అందిస్తున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు నూనె కుమార్, నయాబ్  తాసిల్దార్ ఉదయ్ కుమార్, ఎంపీ ఓ వేణుమాధవ్, వైస్ ఎంపీపి రవీందర్ రావు, ఎంపీటీసీలు బియ్యాన్ని శ్యామల సదానందం, రామగల పోచమ్మ మధుకర్, కిషన్ రెడ్డి, సర్పంచులు మేడగొని సతీష్ గౌడ్,  ఎర్రం శారద సదానందం,  రేషన్ డీలర్లు, ఎంపీడీవో సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.