విద్య, వైద్యం, సమగ్ర అబివృద్ది జరగలంటే పీడిత ప్రజల గొంతుక సీపీఎం ను గెలిపించండి..

విద్య, వైద్యం, సమగ్ర అబివృద్ది జరగలంటే పీడిత ప్రజల గొంతుక సీపీఎం ను గెలిపించండి..

కార్పొరేట్ పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించండి : సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ 

ముద్ర, బీబీనగర్: బడా కార్పొరేట్ శక్తులకు  నాయకత్వం వహిస్తున్న బిజెపి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించి అనునిత్యం ప్రజల పక్షాన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి కొండమడుగు నర్సింహ్మ ని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.  సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలో నూతన సిపిఎం మండల కార్యాలయ ప్రారంభోత్సవంలో  పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపించడం ద్వారా ప్రజా పోరాటాలకు మరింత బలం చేకూరుతుందని తద్వారా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలతో పాటు చట్టసభల్లో కూడా పోరాటం చేసి హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుందని సిపిఎం పార్టీ భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తుందని, అభ్యర్థిగా నిరంతరం పోరాటాలలో అనేక ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న కొండమడుగు నర్సింహ్మ పోటీ చేస్తున్నారని తెలిపారు.

ఈ ఎన్నికల్లో సిపిఎం ను గెలిపించండి శాసనసభకు పంపించండి, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక పోరాడే శక్తులను బలపరచండి, బిజెపి దాని మిత్రులను ఓడించండి అనే మూడు నినాదాలతో పోటీ చేస్తుందన్నారు. నాడు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఎర్రజెండా నాయకత్వంలో అనేక ప్రజా పోరాటాలు నిర్మిస్తున్నామని విజయాల సాధిస్తున్నామని పోరాటాలే ఊపిరిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమరశీలంగా ఉద్యమిస్తున్న సిపిఎం పార్టీని ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం గెలవడం ద్వారా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నీతి నిజాయితీతో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి కొండమడుగు నర్సింహ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేష్,మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్,మండల కార్యదర్శివర్గ సభ్యులు సందెల రాజేష్,టంటం వెంకటేష్,మాజీ మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, మండల కమిటీ సభ్యులు ఉమ్మర్, సత్యనారాయణ, రంజిత్, మాజీ మండల కమిటీ సభ్యులు హరికృష్ణ, గ్యార సురేష్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.