చింతల ఆధ్వర్యంలో  బిఆర్ఎస్ లో చేరికలు...

చింతల ఆధ్వర్యంలో  బిఆర్ఎస్ లో చేరికలు...
  • 500 మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ.....

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం చెరువు కట్ట నుండి పాత బస్టాండ్ వరకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, దేశంలోని ఎక్కడా లేని  సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమేనని  అన్నారు.  హనుమాన్ వాడ 5, 6 వార్డులలో నుండి వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున   యువకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 35వ వార్డ్ ఆర్బి నగర్ కి  చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చింతల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరారు.  జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ  నియోజకవర్గ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు,  పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపులు అమరేందర్, గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్,  మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కుతడి సురేష్, వాళ్లపూ విజయ్, ఎలిమినేట్ మహేందర్ రెడ్డి, గొర్ల అఖిల్, గొర్ల నాని పాల్గొన్నారు.భువనగిరి పట్టణంలో 35వ వార్డ్ ఆర్బి నగర్ కి  చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కుతాడి సురేష్, వల్లపు విజయ్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పెంట నితీష్ పాల్గొన్నారు