తాళ్లగడ్డను బంగారుగడ్డ చేసింది  బీఆర్ఎస్.. ప్రజల మనిషి జగదీష్ రెడ్డి ని గెలిపించాలి 

తాళ్లగడ్డను బంగారుగడ్డ చేసింది  బీఆర్ఎస్..  ప్రజల మనిషి జగదీష్ రెడ్డి ని గెలిపించాలి 
  • అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
  • కాంగ్రెస్‌, బీజేపోళ్లను నమ్మితే మోసపోతం.. గోసపడ్తం.
  • సూర్యాపేట లో ఏమీ చేసామో, ఏమి చేస్తామో చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు
  • జగదీష్ రెడ్డి  హయాంలోనే అని రంగాల్లో "పేట" అభివృద్ధి
  • సూర్యాపేటలో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం
  • సునీతమ్మ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న పట్టణవాసులు

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట: గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని తాళ్లగడ్డను బంగారుగడ్డగా మార్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి దే అని సూర్యాపేట భీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి ఆన్నారు.అధికార యావే  తప్పా సూర్యాపేట లో ఏమీ చేసామో, ఏమి చేస్తామో చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదని  ఆమెఅన్నారు.సూర్యాపేటలోని తాళ్లగడ్డ  27 ,29  వార్డులలో గడపగడప ప్రచారం నిర్వహించిన సునీతమ్మ కు  హారతులు, నివాళులతో పట్టణ  వాసులు ఘన స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ను వివరిస్తూ , పెద్దల యోగక్షేమాలు తెలుసుకుంటూ, చిన్నారులను లాలిస్తూ, సీతమ్మ ప్రచారం కొనసాగింది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగదీష్ రెడ్డి  హయాంలోనే అని రంగాల్లో "పేట" అభివృద్ధి చెందిందని అన్నారు.కాంగ్రెస్‌, బీజేపోళ్లను నమ్మితేమోసపోతం..గోసపడ్తం అన్నారు. సూర్యాపేట అభివృద్ధిని అడ్డుకోవడానికి మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా  ఏకమై వస్తున్న తోడేళ్ల మందను ప్రజలే తరిమికొట్టాలనిపిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాం సూర్యాపేటకు శాపం అన్న సునీతమ్మ అభివృద్ధి, సంక్షేమమే మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాన ఎజెండా అయితే,పదవులే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎజెండా అని పేర్కొన్నారు. 2014 తర్వాత సూర్యాపేట అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని కోరారు.

మరోసారి ఆశీర్వదిస్తే సూర్యాపేట యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మూడవ దఫా పాలన ఉండబోతుందన్నారు. 15,000 మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి, పారిశ్రామిక హభ్ గా సూర్యాపేటను మార్చబోతున్నారని పేర్కొన్నారు. గతంలో ఒక్కో వార్డుకు ఐదు లక్షల నిధులు వస్తేనే మహా గొప్ప విషయం అన్న సునీత జగదీష్ రెడ్డి, 2014 తర్వాత  సంవత్సరానికి ఒక్కో వార్డ్ కు కోటి రూపాయలకు పైగా నిధులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలతో పాటు, సిసి లు, డ్రైన్ లు , పార్క్ లను నిర్మించిన ఘనత భీఆర్ఎస్ పార్టీదే అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3000 , రూ.400కు గ్యాస్‌ సిలిండర్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా పథకం , సన్న బియ్యం పంపిణీ, ఇల్లు లేని పేదలకు ప్రతి ఒక్కరికి పక్కా గృహ నిర్మాణం వంటి పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. గత రెండు మ్యానిఫెస్టోలను నూటికి శాతం అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ దే అన్నారు. జగదీష్ రెడ్డి  నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ  నెల 30 న కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.