ఎస్సై నిర్లక్షం పట్ల రిటర్నింగ్ అధికారి ఆగ్రహం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా ముథోల్ రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి భైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ పని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా భైంసా సమీపంలోని మాటేగాం టోల్ ప్లాజా వద్ద తనిఖీ కేంద్రంలో సిబ్బందితో రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న రూరల్ ఎస్సై శ్రీకాంత్ మొబైల్ లో మాట్లాడుతూ కనిపించటం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు.