ముథోల్ లో బిజెపి కి జనసేన మద్దతు - రామారావు పటేల్ ను కలిసిన జన సైనికులు

ముథోల్ లో బిజెపి కి జనసేన మద్దతు - రామారావు పటేల్ ను కలిసిన జన సైనికులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ఇస్తామని జనసేన పార్టీ నాయకులు సుంకెట మహేష్ బాబు ప్రకటించారు. ఈ మేరకు వారు బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.  జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఇంఛార్జి నెమురి శంకర్ గౌడ్, జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.ఈ సందర్భంగా జన సేన పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టి లోకి ఆహ్వానం పలికారు. అనంతరం మాట్లాడుతూ నియోజక వర్గంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని విమర్శించారు.