విద్యా రంగ పరిరక్షణ కోసం ఆగస్టు 7 నుండి జీపు యాత్ర - ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి శీతల్కర్ అరవింద్

విద్యా రంగ పరిరక్షణ కోసం ఆగస్టు 7 నుండి జీపు యాత్ర - ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి శీతల్కర్ అరవింద్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే ఆగస్టు 7 నుండి ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జీప్ యాత్ర నిర్వహించ నున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి అరవింద్ తెలిపారు. యాత్రకు సంబంధించి కరపత్రాలను శనివారం నిర్మల్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లాకార్యదర్శి శీతల్కర్ అరవింద్ మాట్లాడుతూ బాసర ఐఐఐటి విద్యార్థుల12 డిమాండ్స్ పరిష్కరిస్తామన్న మంత్రి కేటీఆర్  ఒక్క డిమాండ్ కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించలేదన్నారు. జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల లో అన్ని కోర్సులు ప్రారంభించి అన్ని వసతులు కల్పిస్తామని ప్రతి ఏడాది అనడం తప్ప ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ.5,177 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని, హాస్టళ్ల సమస్యలు తీర్చాలని కోరుతూ ఆగస్టు 7 నుండి 11 వరకు జీపు యాత్ర 12 మండలాల్లో  యాత్ర కొనసాగుతుందన్నారు. 7న ఖానాపూర్ పట్టణంలో ప్రారంభించి ఆగస్టు11న ముధోల్ పట్టణంలో సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్రలో విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ యువరాజ్ పాల్గొన్నారు.