నిర్మల్ జిల్లాలో విద్యుత్ షాక్ తో ఇద్దరు దుర్మరణం

నిర్మల్ జిల్లాలో విద్యుత్ షాక్ తో ఇద్దరు దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ లో ఆదివారం జరిగిన ఒక ఘటనలో విద్యుత్ షాక్ తో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. చిన్న బెల్లాల్ లో కొమురం భీం వర్ధంతి కార్యక్రమంలో భాగంగా  జెండాను పైకెత్తే సమయంలో అక్కడే ఉన్న 11 కెవి విద్యుత్ తీగలకు  జండా పైప్ తగిలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్ (26) మార్గ మధ్యంలో మృతిచెందారు.  ఆత్రం భీమ్ రావు(25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరితో పాటు ఉన్న వ్యక్తి వెంకు పటేల్ పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఖాన్ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఆదివాసీ గిరిజన యువకుల మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.