బిఆర్ఎస్ మేనిఫెస్టో.. చేసిన అభివృద్ధిని చూసి...

బిఆర్ఎస్ మేనిఫెస్టో.. చేసిన అభివృద్ధిని చూసి...
  • బిఆర్ఎస్ లో భారీగా చేరికలు:  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి : బిఆర్ఎస్ మేనిఫెస్టో.. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చందుపట్ల మాజీ సర్పంచ్, డిసిసి సెక్రెటరీ చిన్నం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శేఖర్ రెడ్డి సమక్షంలో 150 మంది నాయకులు కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన  పైళ్ళ శేఖర్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలిపించే దిశగా పనిచేస్తానన్నారు. బిఆర్ఎస్ పార్టీ చేరిన వారిలో వల్లపు నరసింహ యాదవ్, సుబ్బురు బీరప్ప, కంకల ఐలయ్య, సిరికొండ ఉప్పలమ్మ, గాజరాజు లక్ష్మి, చిన్నం వీరమ్మ, దుగ్యాల సువర్ణ, పన్నీరు లక్ష్మి,కంకల ఐలయ్య, గజరాజు రాజయ్య,రాచమల్ల నరేష్,దంతూరి శివప్రసాద్, చిన్నం సత్తయ్య,కంకల నరసయ్య, చిన్నం ఆంజనేయులు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బూర్ బీరు మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, చందుపట్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి, సర్పంచ్ చిన్నం పాండు, బిఆర్ఎస్ నాయకులు కేశపట్నం రమేష్, కంకల కిష్టయ్య, జక్క రాఘవేందర్ రెడ్డి, నోముల కృష్ణారెడ్డి, జమ్ముల రమేష్, మాయా బాల్ నరసింహ, మందాడి సిద్ధారెడ్డి, సుబ్బూరు బీరప్ప, కంకల మహేష్, సుబ్బురు చిన్న బీరప్ప  పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరిన 34వార్డు కౌన్సిలర్ గంగ దుర్గ భవాని పట్టణంలోని 34 వ వార్డు  కౌన్సిలర్  గంగా దుర్గాభవాని ఆదివారం  ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.

భువనగిరి పట్టణం 21,22,31 వార్డుల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మూడవసారి కూడా ఫైళ్ల శేఖర్ రెడ్డి నే  భువనగిరి ఎమ్మెల్యే గా గెలిపించుకుంటే నే భవిష్యత్తు బాగుంటుందనే విశ్వాసంతో ఆదివారం 21,22,31 వార్డుల నుండి 100 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.