పెళ్లి వేడుకల్లో అపశృతి

పెళ్లి వేడుకల్లో అపశృతి

 టపాకాయలు పేలి వాహనాలు దగ్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:పెళ్లి సంబరాల్లో మునిగి చూపిన నిర్లక్షం మూలంగా అగ్నిప్రమాదం సంభవించిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో మంగళ వారం చోటు చేసుకుంది. బాసరలో సరస్వతీ కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకల్లో భాగంగా కొంత మంది యువకులు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగసి ప్రక్కనే పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపై పడటంతో నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితో పాటు టెంట్ హౌజ్ సామాగ్రి కూడా కొంత మేరకు దగ్ధం అయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.