విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి...

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి...
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్
  • కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం  ఉదయం ఆరు గంటల వరకు అడ్డగూడూరులో 117.8 మిల్లీ మీటర్లు, ఆలేరు 112.5 మిల్లీ మీటర్లు, మోటకొండూరు 91.8  మిల్లీ మీటర్లు, భువనగిరి లో 90.8 మిల్లీ మీటర్లు నమోదైంది.

మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో కురిసిన వర్షాలకు యాదాద్రి జిల్లాలో మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమ లింగం లోలేవల్ బ్రిడ్జి  పై నుండి మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. భువనగిరి నుంచి తుర్కపల్లి వెళ్లే రహదారిలో వడపర్తి రైస్ మిల్లు దగ్గర  వడగాలులతో కూడిన వర్షానికి చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది ప్రయాణికులు గమనించగలరు. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలేవల్ బ్రిడ్జి పై నుండి మూసి నది వరద  వెళ్తుంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి - పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ పమేలా సత్పతి

భారీ వర్షాల నేపథ్యం లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.
ప్రజలు సహాయం కోసం 08685-293312 నెంబర్ల కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటు లో ఉంటుందని వెల్లడించారు. 

భువనగిరి నుంచి తుర్కపల్లి వెళ్లే రహదారిలో వడపర్తి రైస్ మిల్లు దగ్గర  వడగాలులతో కూడిన వర్షానికి చెట్టు కులి రోడ్డుకు అడ్డంగా పడింది ప్రయాణికులు గమనించగలరు. అధికారులు జిల్లా ప్రజలను, వాగుల పక్కన ఉండే గ్రామాలు, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కూలిన ఇల్లు..
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భువనగిరి పట్టణం సమ్మజ్ చౌరస్తా లో కూలిన జటలింగ్ బాలకృష్ణ ఇల్లు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.