చెట్టును ఢీకొన్న డీసీఎం ..ఈ ప్రమాదంలో..?

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటన మర్పళ్లి మండలం పట్లుర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...బంటారం మండలం రొంపల్లి నుండి పట్లుర్ వైపు పత్తి లేబర్ తో వెళుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న తుమ్మ చెట్టుకు ఢీకొనడంతో డ్రైవర్ కాలు నుజ్జు నుజ్జు అయింది. జేసిబి సాయంతో డీసీఎం వ్యాన్ నుండి డ్రైవర్ ను బయటికి తీశారు.అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది