తాండూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీఎస్పీ విస్తృత ప్రచారం

తాండూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీఎస్పీ విస్తృత ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బీఎస్పీ తాండూర్ నియోజవర్గ అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ తాండూర్ నియోజవ్గం లోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తాండూర్ మండలం చంద్రవంచ, 
 బషీరాబాద్ మండలం కోత్లాపూర్, దామర్చెడ్, మైల్వర్, యాలాల మండలం పగిడిపల్లి  గ్రామాలలో  బీఎస్పీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. తాండూర్ నియోజకవర్గం లో పలు సమస్య లు అపరిష్కృతంగా ఉన్నాయని, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల తో పాటు రోడ్ల తీరు దారుణంగా ఉన్నాయనీ అన్నారు.
మీ వెంబడి ఉండి అన్ని విధాలుగా అండగా ఉండి సమస్య లు పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.