వికారాబాద్ జిల్లాలో నాలాలు కబ్జాలైతున్నయి..! | Mudra News

వికారాబాద్ జిల్లాలో నాలాలు కబ్జాలైతున్నయి..! | Mudra News

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: వర్షా కాలం వచ్చిందంటే కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలో వాగులు, నాలా కాలువలు ఉప్పొంగి  ప్రవహిస్తాయి.అయితే జిల్లాలో వెలుస్తున్న వెంచర్లలో నాళాలు కబ్జాలకు గురవుతున్నాయి.తాజాగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధ్గుల్ చిట్టెంపల్లి సమీపంలో కొత్తగా వెలుస్తున్న ఓ భారీ వెంచర్ లో నాలా కాలువ కబ్జాకు గురైనట్లు సమాచారం. గ్రామంలో నుండి ఆ కాలువ ద్వారా నీరు బయటికి ప్రవహిస్తుంది.అయితే ఆ నాలా కాలువ వద్ద కొద్ది పాటి సిమెంట్ పైపు వేసి పైనుండి మట్టితో  కప్పేశారు. అయితే ఇలాంటి చర్యకు స్థానిక నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.అయితే ఇందులో నిర్మితమయ్యే వర్షా కాలంలో  ముంపు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు.కావున మున్సిపల్,రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు అవసరం ఎంతైనా ఉందంటున్నారు