మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల అడ్డ: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల అడ్డ: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
  • నల్లగొండ ను ఎర్రగొండగా చరిత్ర తిరగరాసేందుకు కమ్యూనిస్టులు సిద్ధమయ్యారు
  • సిపిఎం బలపరిచిన ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కమ్యూనిస్టులు నడుం బిగించాలి

చండూరు, ముద్ర:మునుగోడు గడ్డ అంటేనే కమ్యూనిస్టుల అడ్డగా మళ్లీ చరిత్రను పునరావతం చేసే విధంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. మంగళవారం మునుగోడు మండల పరిధిలోని  కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ శాఖ సమావేశం కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన నల్లగొండ ను ఎర్రగొండ గా చెప్పుకునే విధంగా మహనీయులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కమ్యూనిస్టులు నడుం బిగించి పోరాడాల్సిన అవసరం  ఉందని అన్నారు . గత పది సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి బిఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని మండిపడ్డారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త కొత్త హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు . కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి సంపదను పెట్టుబడుదారులకు చౌక ధరల్లో పెట్టుబడుదారులకు కట్టబెట్టడంతో పెట్టుబడుదారులు  ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరిగే విధంగా ప్రభుత్వాలు 300కు ఉన్న గ్యాస్ సిలిండర్  12 వందల కు పెంచడంతో పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో  ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రతి సంవత్సరం నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో 20 కోట్ల నిరుద్యోగుల భర్తీ ఎక్కడ చేశావో చూపించాలని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయని ఆశించిన పేద ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళిత ముఖ్యమంత్రి , మూడెకరాల భూమి , డబల్ బెడ్ రూమ్ వంటి పథకాలను ఆశ చూపి పేద ప్రజలను నిట్టున ముంచారని ధ్వజమెత్తారు.

గత పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను  ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించకుండా దళిత బందు పథకం ఆశ చూపి మరోసారి పేద ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కుట్ర కు తెరలేపిందని అన్నారు . రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలను , విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకాన్ని అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నదని ఆరోపణ చేశారు . ప్రజా సమస్యలను విస్మరించి పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అండగా ఉండే కమ్యూనిస్టు పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు . ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎర్రజెండా రాజ్యం కోసం సిపిఎం ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ప్రత్యర్ధులకు దీటుగా గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం మునుగోడు మండల కార్యదర్శిమిర్యాల భరత్,సిపిఎం మండల సహాయ కార్యదర్శివరికుప్పల ముత్యాలు, కల్వకుంట్ల గ్రామ శాఖ సహాయ కార్యదర్శి అయితగోని యాదయ్య శాఖ సభ్యులు, పార్టీ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.