దేశంలోని అన్ని గ్రామాల అభివృద్ధి మోడీ లక్ష్యం

దేశంలోని అన్ని గ్రామాల అభివృద్ధి మోడీ లక్ష్యం
  • ఉద్యమంలో పేదోడు చస్తే పెద్దోడు రాజ్యమేలుతుండు
  • కెసిఆర్ వి బ్లాక్మెయిల్ రాజకీయాలు
  • ఇక్కడ చెల్లని రూపాయి ఎక్కడా చెల్లదు
  • రుణమాఫీకి రూ.25000 కోట్లు
  • దళిత బంధు  అమలుకు రూ.17700 కోట్లు కావాలి
  • 80000ఉద్యోగాలకు రూ.5000కోట్లు బడ్జెట్లో కేటాయించాలి

ముద్ర, పరిగి: దేశంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే మోడీ లక్ష్యం అని బిజెపి పార్టీతెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో పేదోళ్లు అమరులైతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేదోడు రాజ్యమేలాలి కానీపెద్దోడు రాజ్యమేలుతుండని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం పరిగి మండల పరిధిలోని రూప్ ఖాన్ పెట్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన స్వీట్ కార్న్ కార్యక్రమంలో మాట్లాడుతూ...రాష్ట్రంలో కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.. ఇక్కడ చెల్లని రూపాయి ఎక్కడ చల్లదన్నారు.   తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని ఇతర రాష్ట్రాలలో ఎలా గెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యువజన పథకంకింద తెలంగాణ రాష్ట్రానికి 2.4లక్షల ఇండ్లు మంజూరు చేసిందన్నారు.రోజ్ గార్ మేళా పథకం కింద .ఈ సంవత్సరం పదిలక్షల ఉద్యోగాల కల్పించిందన్నారు. 80 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం .రాష్ట్ర బడ్జెట్లో1000 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.80 వేల ఉద్యోగాలకు సుమారుగా5000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంటుందన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.25 వేల కోట్లు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఫసల్ యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. యూరియా ఒకబస్తాకు రూ.2450 ఖరీదు కాగా .కేంద్రం రూ.269 అందజేస్తూ రైతులకు యూరియా పై రూ.2184 సబ్సిడీ ఇస్తుందన్నారు.డి ఏ పి ఒక బస్తాకు రూ.8073 ఖరీదు కాగా రూ.1350 అందజేస్తూ రూ.2501సబ్సిడీ ఇస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం రైతుకు ఒక ఎకరానికి రూ.30,000సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. 2014 సం.లో వరి ధాన్యం క్వింటాలికి రూ. 1310 మద్దతు ధర ఇవ్వగా 2023 సం: లో రూ.2060 మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. ట్రాన్స్ పోర్ట్, గోదాము నిల్వ, గోనె సంచులఖర్చులు కేంద్రమే భరిస్తుందని తెలిపారు. కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్ర సర్పంచులకు బకాయిలు .ఇచ్చేది లేదని చెప్పారని గుర్తు చేశారు.కెసిఆర్ నియోజకవర్కెసిఆర్ నియోజకవర్గ వీర్లపల్లి తండా. సర్పంచ్ భర్త చేసిన పనులకు బిల్లుల రాక ఆత్మహత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. గ్రామాలలోసడన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేస్తుందని,వీధి దీపాలు,ఉచిత బియ్యంవంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది అన్నారు.

కెసిఆర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసి మిగతా పార్టీ ప్రజా ప్రతినిధులకు పార్టీలో చేరితే తప్పబిల్లు మంజూరు కావని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిజెపి పార్టీలో చేరితేనే బిల్లులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు బిజెపి ఉకుం జారీ చేస్తే బిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పిటిసిలు ఎంపీటీసీలు ఎవరు ఉండరని తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలంటే రూ.17700 కోట్ల నిధులు కావాలన్నారు. కల్వకుంట్ల కవితఇతర రాష్ట్రాలలో సారా (లిక్కర్) దందా చేస్తుందని పొరుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు .హేళన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, బిజెపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.