రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరయ్య

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరయ్య

 ముద్ర, షాద్ నగర్: షాద్ నగర్ ముఖ్య కూడలి నుండి బైపాస్ రోడ్డు వరకు రోడ్డు పనులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ప్రారంభించారు.. స్థానిక ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ రోడ్డు కోసం మొదట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరి నాటు వేసి మరి నిరసన తెలిపామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తానని ఇచ్చిన హామీకి కట్టుబడి గణతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మెల్యే శంకర్ కు తెలిపారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించి మొదట జెసిబి వాహనం నడిపి పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రోడ్డు పనులను  సందర్భముగా రోడ్డు ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు స్వీటు తినిపించారు. ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణమైన ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని, చాలాకాలంగా ప్రజలు ఈ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంగా ఈ పనులను పూర్తి చేస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి భీష్మ కిష్టయ్య  కాశీనాథ్ రెడ్డి ఎంపీపీ ఇద్రీస్ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రఘు, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, జమృద్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు..