జానపహాడ్ దర్గా ఉర్సు మహోత్సవం లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది

జానపహాడ్ దర్గా ఉర్సు మహోత్సవం లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది
  • రెండేళ్లలో  రూ. కోటి తో దర్గా భక్తులకు సౌకర్యల ఏర్పాటు
  • గతంలో చేసింది నేనే ఇకపై అభివృద్ధి చేసేది నేనే.. ఉత్తమ్
  • సాగర్ కాలువ నుండి త్రాగు నీటిని విడుదల చేస్తాం.
  • తెలంగాణ ప్రజలు ఇచ్చింది చారిత్రాత్మక తీర్పు..
  • పాలకవీడు మండలంలో వున్న లిఫ్ట్ ల మరమ్మత్తులకు హామీ 

పాలకవీడు, ముద్ర: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కొలువుదీరిన 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన జానపహాడ్ దర్గా ఉర్సు మహోత్సవంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాలు శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్ది పాల్గొన్నారు. గంధం ఊరేగింపులో పాల్గొని సైదులు బాబాను దర్శనము చేసుకున్నారు. వర్షాలు మంచిగా పడి, రైతులకు పంటలు పండాలి లాభాదాయకంగా ఉండాలని భగవాబుతుడ్ని కోరారు. ఈ సందర్బంగా పాలకవీడు  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో అయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పని తీరును దుయ్యబట్టారు,10  ఏళ్లలో ప్రజలు బంధీలుగా వున్నారని. వారే చరిత్రత్మక తీర్పుని ఇచ్చారని అన్నారు. రాష్ట్రా ఖజానాను బి ఆర్ ఎస్ పాలకులు కాలి చేసారాని, అన్ని శాఖలను వేలకోట్ల అప్పులో నెట్టేసారని విమర్శించారు.రైతులకు 24గంటల విద్యుత్ అనేది పచ్చి అబద్దామని రికార్డులు చెబుతున్నాయాన్నారు.

90వేల కోట్ల అప్పులో విద్యుత్ శాఖ ఉందన్నారు.ప్రజల పై 40 వేల కోట్ల అప్పు భారం నెట్టి పైసలు తినే కార్యక్రమంగా మిషన్ భగీరధను వాడుకున్నారని మండిపడ్డారు.పాలకవీడు మండల రైతులకు  గతంలో తాను నిర్మించున లిఫ్ట్ లను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చెప్పడతామని హామీ ఇచ్చారు.సాగర్ కాలువ నుంచి త్రాగు నేటిని విడుదల చేస్తామన్నారు. ప్రజలు పూర్తి స్వేచ్ఛలో వారు ఇచ్చింది చారిత్రత్మక తీర్పు అన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రైజ్రక్టుల పెరూతో బి ఆర్ ఎస్ నాయకుల జేబులు నిండాయని విమర్శించారు.రెండేళ్లలో జానపహాడ్ దర్గాను కోటి రూపాయలతో అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గోపాల్ నాయక్, జడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, ఎం పిటీసీ ఉపేందర్,దర్గా ముజావర్ ఝానీ, మండల కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి, బెల్లంకొండా నరసింహ రావు, ఆర్థివో వెంకారెడ్డి,ఎమ్మార్వో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.