హోరాహోరీగా కొనసాగుతున్న సీఎం కప్ 20-23

హోరాహోరీగా కొనసాగుతున్న సీఎం కప్ 20-23

 సీఎం కప్ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా  పాల్గొంటున్న క్రీడాకారులు 

ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎండ వేడిమి లేకుండా, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పర్యవేక్షణలో జరుగుతున్న పోటీలు 

ముద్ర ప్రతినిధి: సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి  ప్రోత్సాహంతో జరుగుతున్న  పోటీలలో ఇప్పటివరకు ఉమెన్స్  కోకో టీం విన్నర్స్ గా తుంగతుర్తి రన్నర్స్ గా సూర్యాపేట గెలుపొందారు. మంగళవారం సీఎం కప్ 2023 పురుషుల కబడ్డీ పోటీలలో మద్దిరాలపై నడిగూడెం గెలుపొందారు, చింతలపాలెం పై మోతే గెలుపొందారు, పాలకీడు పై మునగాల గెలుపొందారు, పెన్పహాడ్ పై తుంగతుర్తి గెలుపొందారు, హుజూర్నగర్ పై మఠంపల్లి గెలుపొందారు, మేళ్ళచెరువుపై కోదాడ గెలుపొందారు, అనంతగిరిపై నూతనకల్ గెలుపొందారు, తిరుమలగిరి పై చిలుకూర్ గెలుపొందారు,                              

ఉమెన్స్ కబడ్డీ నడిగూడెంపై మేళ్లచెరువు గెలుపొందారు, సూర్యాపేట పై హుజూర్నగర్ గెలుపొందారు, నూతన కల్ పై నేరేడుచర్ల గెలుపొందారు. పురుషుల కోకో పోటీలలో నేరేడుచర్లపై చింతలపాలెం గెలుపొందారు, తిరుమలగిరి పై సూర్యాపేట గెలుపొందారు, మద్దిరాలపై చివ్వెంల గెలుపు పొందారు, జాజిరెడ్డిగూడెం పై నాగారం గెలుపొందారు, చిలుకూరు పై తుంగతుర్తి గెలుపు పొందారు, మద్దిరాలపై చివ్వేంల గెలుపొందారు, పురుషుల వాలీబాల్ పోటీలలో మోతే పై సూర్యపేట గెలుపొందారు, తుంగతుర్తి పై తిరుమలగిరి గెలుపొందారు ,మఠంపల్లి పై చిలుకూర్ గెలుపొందారు. మహిళల వాలీబాల్ పోటీలలో ఫైనల్ కు వచ్చిన టీములు గరిడేపల్లి , అనంతగిరి వీరి మధ్య ఫైనల్ పోటీ నిర్వహించాల్సి ఉంది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు వసతి కల్పిస్తూ భోజన సదుపాయం అందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో  జడ్పీ సీఈవో సురేష్ కుమార్, డి వై ఎస్ ఓ వెంకట్ రెడ్డి. రేపు సాయంత్రం జరిగే ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.