సోదర ప్రేమకు ప్రతిరూపం రాఖి..

సోదర ప్రేమకు ప్రతిరూపం రాఖి..

ముద్ర, చివ్వేంల :- మానవ సంబంధాలను ప్రతిష్టం చేస్తూ  సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచేది "రక్షాబంధన్ "  రాఖీ.సాంప్రదాయ బద్ధమైన మన విలువలను మరింత ఉట్టి పడేలా చేస్తుంది. అమ్మాయిల పట్ల ఉన్మాదత్వం , విచక్షణ వంటి  వెకిలి చేష్టలు , పెట్రేగి  మానవతా విలువలు మంటగలుస్తున్న  ప్రస్తుత యుగంలో రాఖి పౌర్ణమి  తన విశిష్టతను చాటి చెబుతూ  సోదర ప్రేమ ప్రతిష్టకు  దోహదపడుతుంది. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని మండల వ్యాప్తంగా  గురువారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని  కులమతాలకతీతంగా   జరుపుకున్నారు.