తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
  • అక్క చెల్లెల్లు అన్నదమ్ములతో కళకళలాడిన గ్రామ సీమలు
  • అక్క చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని మిఠాయిలు పంచుకున్న అన్నదమ్ములు

తుంగతుర్తి ముద్ర:-రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుండి రాఖీల దుకాణాల వద్ద అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములు గుంపులు గుంపులుగా చేరి రంగురంగుల రాఖీలను కొనుగోలు చేశారు .అనంతరం తమ తమ ఇళ్లలో అన్నలకు చెల్లెలు అక్కలకు తమ్ముళ్లు రాఖీలు కట్టి మిఠాయిలు తిన్నారు. వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి రాఖీ కట్టడానికి వచ్చిన అక్కా చెల్లెళ్లతో అన్న తమ్ముళ్లతో గ్రామ సేవలు కలకల్లాడాయి. ఏ ఇంట్లో చూసినా రాఖీ పండుగ సందడే కనిపించింది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మెయిన్ రోడ్డు పై అనేక రాఖీల దుకాణాలు వెలిశాయి. అన్నాచెల్లెళ్ల అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకైనా రాఖీ పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకున్నారు.