రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణం తొలగించాలి...

రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణం తొలగించాలి...

ఎంపీడీవోకి వినతిపత్రం అందజేత

కోదాడ, ముద్ర:అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన అజ్మీర తండా గ్రామంలోని 10వ వార్డులో రోడ్డుమీద అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని పదో వార్డ్ మెంబర్ రమేష్ గ్రామస్తులు, వాపోతున్నారు.ఇదే విషయమై స్థానిక ఎంపీడీవో విజయకు గురువారం వినతిపత్రం అందజేశారు.


డ్రైనేజీ నిర్మాణం కొరకు నిధులు మంజూరు అయినప్పటికీ  ప్రహరీ గోడ అడ్డంగా ఉండడంతో డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే ఆగుతున్నాయని తెలిపారు.ఇండ్లలోని మురికి నీళ్లు రోడ్ల మీద పోతుంటే దుర్వాసన వస్తుందని వార్డు ప్రజలు పేర్కొన్నారు. సిసి రోడ్డుపై అక్రమంగా ..... ప్రహరీ గోడ కట్టిన వ్యక్తిపై గ్రామపంచాయతీ కార్యదర్శి బిల్ కలెక్టర్ చర్యలు తీసుకోకుండా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇకనైనా అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను గ్రామపంచాయతీ అధికారులే దగ్గర ఉండి ప్రహరి గోడ తొలగించాలని డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయించాలని వినతి పత్రంలో అధికారులను కోరారు. ఇదే విషయమై ఎంపీవో జగదీష్ ను వివరణ అడగగా... గ్రామానికి చెందిన 10 వ వార్డు మెంబర్ వినతిపత్రం అందించారని, సోమవారం విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు