1200 కోట్ల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నీరా పరిశ్రమ అభివృద్ధి చేస్తాం... 

1200 కోట్ల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నీరా పరిశ్రమ అభివృద్ధి చేస్తాం... 
  • గీత కార్మిక వృత్తి నిగౌరవప్రదమైన వృత్తిగా మారుస్తాం..
  • నాడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లో  గీత కార్మిక వృత్తి కీలకమైంది...
  • వృత్తిలో అభద్రతాభావంతో గీతా పని వారు తగ్గిపోయారు...
  • తెలంగాణ ప్రభుత్వం గీత పని వారికి ఉపాధి  కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది....
  • తెలంగాణ ఉద్యమంలో కోదాడ ప్రాంత  ఉద్యమాలు కీలకమైనవి...
  • గీతా కార్మిక సహకార సంఘ చైర్మన్ గా  గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా... పల్లె రవికుమార్ గౌడ్....

కోదాడ, ముద్ర:ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లో కీలకంగా ఉన్న గీత కార్మిక వృత్తి నేడు గీతా కార్మికుల్లో ప్రమాదాల వల్ల  అభద్రతాభావంతో  పూర్వ వైభవం కోల్పోయిందని గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గా తిరిగి వృత్తికి పూర్వవైభవం తెస్తానని తెలంగాణ గీతా కార్మిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకప్పుడు 12 లక్షల మంది గీతా సహకార సంఘాల సొసైటీలో ఉన్న కార్మికులు నేడు 2.25 లక్షల మందికి తగ్గిపోయారన్నారు. వృత్తి పట్ల అభద్రతాభావం,బతుకు దెరువు కోల్పోవడం వంటి కారణాల వల్లే ఈ విధంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీతా కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గీతా కార్మిక వృత్తి గౌరవప్రదమైన వృత్తిగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రంలో నీరా పరిశ్రమను అభివృద్ధి చేస్తుందన్నారు ఈ పరిశ్రమ అభివృద్ధితో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు నిరాపానియం అత్యుత్తమమైన పానీయమని అన్ని రకాల పోషక విలువలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభమైన నీరా సెంటర్లలో నీరా పానీయానికి విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. స్టార్ హోటల్ కంటే ఎక్కువగా నీరా కేంద్రాలు అభివృద్ధి సాధిస్తాయి అన్నారు. సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ గీత కార్మిక వృత్తికి వన్నెతెస్తానన్నారు. తొలి దశ మలిదశ ఉద్యమాల్లో కోదాడ ప్రాంతం పేరుగాంచిందన్నారు.2009 లో చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఉద్యమ సమావేశం నిర్వహించామని ఇక్కడి ప్రాంతంలో ఉన్నవారు ఉద్యమాల్లో కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కారింగుల అంజన్న గౌడ్ సైదయ్య గౌడ్ ఉయ్యాల నరసయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు