కిట్స్ కళాశాల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలి

కిట్స్ కళాశాల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలి

టీఎస్ జేఏసీ చైర్మన్ బట్టు శ్రీహరి నాయక్

కోదాడ, ముద్ర:కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం చేస్తున్న అక్రమాలు మోసపూరిత చర్యల గురించి సమగ్ర విచారణ చేపట్టాలని టీఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీహరి నాయక్, టీఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తూము నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు...కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అనుమతి కోసం చైర్మన్ నిలా సత్యనారాయణ సమర్పించిన భూమి ,భవనాల సమాచారం పూర్తిగా చట్ట విరుద్ధమైనవి అన్నారు. డాక్యుమెంట్ నెంబర్ 9309/2002,9706/2012 ద్వారా ఏఎసిటీ ఇ కి సమర్పించిన భూమి పత్రాలు నకిలీవని ఆయన పేర్కొన్నారు. కళాశాల నిర్వహణ కోసం కావలసిన భవనాల అనుమతులు స్థానిక గ్రామపంచాయతీ నుండి కానీ మున్సిపాలిటీ నుండి కానీ పొందలేదు అన్నారు.

2010 సంవత్సరంలోనే చైర్మన్గా కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీకి తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ 2010 సంవత్సరము నుండి 2019వ సంవత్సర వరకు ప్రతి సంవత్సరం ఎఫ్ ఎస్ సి కమిటీకి సమర్పిస్తున్న పత్రాలలో తానే కీట్స్ కళాశాల చైర్మన్గా కోరుకుంటూ జేఎన్టీయూ, ఏఐసిటిఈ అధికారులను మోసం చేస్తున్నారన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ రికార్డులలో  2020- 21,2021-22 ల లో సిహెచ్ కేశవరావును చైర్మన్గా నమోదు చేయబడి ఉందని తెలిపారు. చైర్మన్గాకళాశాల పేరు మీద శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్న మోసపూరిత రుణానికి సంబంధించి సివిల్ కేసులు నడుస్తున్నాయన్నారు. ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలతో కీట్స్ కళాశాల నిర్వహిస్తున్న నేల సత్యనారాయణ కాకతీయ ఎడ్యుకేషన్ సొసైటీ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎస్ జేఏసీ ప్రెసిడెంట్ తాము నవీన్ యాదవ్, డీజీవిపి స్టేట్ ప్రెసిడెంట్ శివరాత్రి ప్రశాంత్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రనాయక్, టిజీ విపి ఓయూ ప్రెసిడెంట్ తాడెం   రాజేష్, టీజీవిపి స్టేట్ సెక్రటరీ నాగయ్య గౌడ్, రత్నాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు