పాసిగామలో చోరీ...

పాసిగామలో చోరీ...

వెల్గటూర్: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని పాసిగామ గ్రామంలో గురువారం రాత్రి రెండు ఇండ్లల్లో  చోరీ జరిగింది. కాగా దుండగులు నలిమెల చంద్రయ్య ఇంట్లో నుంచి రూ.30 వేలు, వాసం సతీష్ ఇంట్లో నుంచి  రూ.70 వేల నగదును దొంగిలించారు.  ఇంటి యజమానులు రాత్రి పడుకున్న సమయంలో  చప్పుడు కాకుండా ఇంట్లో చొరబడి  ఈ దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం.

కాగా అక్కడి స్థానికులు  ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఇండ్లను పరిశీలించారు.  జగిత్యాల నుంచి  డాగ్ స్కాడ్స్ తో వివరాలను సేకరించారు. కాగా రెండు ఇళ్లలో చోరీ జరగడంతో మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో నిఘాను పెంచాలని కోరుతున్నారు.