దివ్యాంగులకు చేయూతనివ్వాలి.. 

దివ్యాంగులకు చేయూతనివ్వాలి.. 
  • 30 వేల రూపాయల విలువగల ఆట వస్తువులు పుస్తకాల పంపిణీ..

హుజూర్ నగర్ ముద్ర:-దివ్యాంగులకు దాతలు చేయూతనివ్వాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి సైదా నాయక్ కోరారు. శుక్రవారం స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రంలో విద్యార్థులకు 30 వేల రూపాయలు విలువగల ఆట వస్తువులను పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. స్థానిక దాతలు అనిల్ కుమార్ 20000 రూపాయలు ,మాజీ మున్సిపల్ చైర్మన్ దంతకల్ శ్రీనివాస్ పదివేల రూపాయలు, సహాయంతో ఆట వస్తువులు పుస్తకాలు కొని అందించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. చిన్నారుల వైకల్యం చూడవద్దని అన్నారు. ప్రభుత్వ0  భవిత దివ్యంగుల కేంద్రంలో వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ కల్పిస్తుందని తెలిపారు. ఫిజియోథెరపీ వంటి సహాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు అనిల్ కుమార్ దంతగాని శ్రీనివాస్ గౌడ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్ మీరా హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాధా దుర్గా ఎతిపతిరావు శ్రీనివాస్ సైదులు తదితరులు పాల్గొన్నారు.