హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన బాదె సురేష్ కుమార్

హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన బాదె సురేష్ కుమార్

ముద్ర, అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన బాదె సురేష్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు.వీరు 2004 లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సెలెక్ట్ అయ్యారు.సైబరాబాద్ కమిషనరేట్ లో సిటీ ట్రైనింగ్ సెంటర్, గచ్చిబౌలి నందు తోటి సిబ్బంది కి అధికారులకు కంప్యూటర్ నందు శిక్షణ ఇచ్చారు.తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్,ఎల్బి నగర్ లో స్టేషన్ రైటైర్ గా విధులు నిర్వర్తించారు.ప్రస్తుతం డిపుటేషన్ పై ఏసీబీ, ఖమ్మం రేంజ్ నందు తనదైన శైలి లో బాధ్యతగా విధులు నిర్వర్తించారు.ఇందుకు  గాను వారికి 2021 లో సేవా పతక పురస్కారం కూడా లభించింది.ఈ క్రమంలో సురేష్ సేవలు గుర్తించిన ప్రభుత్వం హెడ్ కానిస్టబుల్ గా పదోన్నతి కల్పించి సూర్యాపేట జిల్లా కు కేటాయించడం జరిగింది.ఈ సంద్భంగా శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన బాదె సురేష్ కుమార్ ని అమీనబాద్ గ్రామ ఉద్యోగ మిత్ర మండలి సభ్యులతోపాటు గ్రామస్తులు అభినందించారు.