జాతీయ రహదారిపై కారు ఢీకొని గేదె దూడ మృతి.. ప్రమాదంలో నుజ్జునుజ్జన కారు ముందు భాగం

జాతీయ రహదారిపై కారు ఢీకొని గేదె దూడ మృతి..  ప్రమాదంలో నుజ్జునుజ్జన కారు ముందు భాగం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల కేంద్రానికి సమీపాన వెలుగుపల్లి తుంగతుర్తి గ్రామాల మధ్య జాతీయ రహదారి 365 పై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని గేదె దూడ మృతి చెందిన సంఘటన జరిగింది .వెలుగుపల్లి గ్రామానికి చెందిన వెంకన్న తన పశువులను తోలుకొని వస్తుండగా వెలుగు పల్లి వైపు  నుండి మద్దిరాల వైపు వెళుతున్న కారు ఢీ కొనడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందగా కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది తుంగతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.