చిదుగుకు సన్మానం

చిదుగుకు సన్మానం

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా  గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ హైదరాబాద్ హాస్టల్ సలహాదారునిగా ఎన్నికైన సందర్భంగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పుష్పగుచ్చమిచ్చి  శాలువతో  ఘనంగా సన్మానించారు. సలహాదారునిగా గౌడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలిగేలా చూడాలని ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ నాయకులు, గంట వెంకటేష్ గౌడ్, గంట అంజాగౌడ్, నాగుల ప్రదీప్ గౌడ్, గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు.