గిరిజన మహిళపై  పోలీసుల దాడి సంఘటన లో పోలిసుల పై వేటు 

గిరిజన మహిళపై  పోలీసుల దాడి సంఘటన లో పోలిసుల పై వేటు 

కానిస్టేబుల్ శివ శంకర్ ను కానిస్టేబుల్ సుమ లత ను సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ చౌహన్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : గిరిజన మహిళపై  పోలీసుల దాడి సంఘటన లో పోలిసుల పై  రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ వేటు వేసారు. కానిస్టేబుల్ శివ శంకర్ ను కానిస్టేబుల్ సుమలత ను సస్పెండ్  చేసారు.

ఎల్‌బీ నగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలుగ చేసిన ముగ్గురు మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్‌బీనగర్ పీఎస్‌కు, పెట్రోలింగ్ పోలీసులు తీసుకెళ్లారు.  వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు. 

అయితే, ఒక మహిళ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఆమెపై పోలీసుల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ విచారణ ఆదేశించి, నివేదికను తెప్పించుకుని, మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్,  మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.