సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి
  • నీళ్లు లేక ఎండిపోతున్న నారుమళ్లు,వరి పొలాలు
  • రాష్ట్ర రైతు సంఘం నాయకులు దుగ్గి బ్రహ్మం

హుజూర్ నగర్ టౌన్ ముద్ర : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు వెంటనే సాగు నీరు విడుదల చేయాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధుగ్గి బ్రహ్మం కోరారు. హుజూర్ నగర్ పట్టణం లో గురువారం రైతుసంఘం అధ్వర్యంలో రైతులతో కలిసి నారుమళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్ ఆరంభం అయ్యి రెండు నెలలు కావస్తుందని సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు,బావుల కింద నాట్లు పూర్తయి  రోజులు గడుస్తున్న   రైతులకు  సాగుకు నీటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని సిపిఎం మండల పార్టీ  ప్రభుత్వాన్ని కోరింది.గత ప్రభుత్వాలలో 480 అడుగులు నీరు ఉన్నప్పుడు సాగునీటిని విడుదల చేశారని ఇప్పుడు 518 అడుగులు ఉన్న నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వానికి నీటిని విడుదల చేయడం లో నిర్లక్ష్యం తగదన్నారు. తక్షణమే సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  రైతులు రేపాకుల వెంకన్న, దేవరం పురుషోత్తం రెడ్డి, పుల్లా రెడ్డి, పింగళి వెంకట్ రెడ్డి, ప్రసాద్, రవీందర్రెడ్డి ,రాజేష్,  రైతులు   పాల్గొన్నారు.