ఈ నెల 17 న తుక్కగూడెం లో జరిగే విజయభేరి సభను విజయవంతం చెయ్యాలి - ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ నెల 17 న తుక్కగూడెం లో జరిగే విజయభేరి సభను విజయవంతం చెయ్యాలి - ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , కోదాడ: శుక్రవారం కోదాడ లోని గుడుగుంట్ల అప్పయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాంగ్రేస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ తామకు కోదాడ లో స్థిర నివాసం ఉండాలన్న ఉద్దేశం తో ఇక్కడ గృహ నిర్మాణం చేసి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రేస్ కుటుంబ సభ్యులను పిలిచి మీ అందరితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నామని అన్నారు . హైదరాబాద్ లో ఈ నెల 18 న లో జరిగే ఏఐసిసి సమావేశానికి దేశం లో ఉన్న కాంగ్రేస్ దిగ్గజాలు వస్తున్నారన్నారు  . ఈ ఏఐసిసి సమావేశాలకు ముందు రోజు 17 న తుక్కగూడెంలో జరిగే విజయభేరి సభకు భారీగా తరలి రావాలన్నారు . ఈ మీటింగ్ కు కోదాడ నుండి 50 ఆర్టీసీ బస్సులను మా తరపున పెడుతున్నామన్నారు . ఈ సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు . తెలంగాణ రాష్ట్రం లో నవంబర్ , డిసెంబర్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి రాష్ట్రం లో అధికారం లోకి వస్తుందన్నారు . ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 12 కు 12 అసెంబ్లీ స్థాన కాంగ్రేస్ గెలుస్తుందన్నారు . కార్యకర్తలనుద్దేశించి కోదాడ నుండి మీ అభీష్టం మేరకు పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుందని 50 వేల మెజార్టీతో విజ్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు  . ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నాయకులకు సూచించారు . ఈ ఆదివారం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ 5 హామీలను (గ్యారంటీ) ప్రకటిస్తారని , ఆ ఐదు హామీలను ఇంటింటికి చేర్చే బాధ్యత కార్యకర్తలదే అన్నారు .