ఎమ్మెల్యే సైదిరెడ్డి తో అమి తుమికి సిద్ధపడ్డ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే సైదిరెడ్డి తో అమి తుమికి సిద్ధపడ్డ కౌన్సిలర్లు
  • వైస్ చైర్మన్ పై అవిశ్వాస విషయంలో ఒకటైన బీ ఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు
  • వైస్ చైర్మన్ పై అవిశ్వాసం వద్దంటున్న ఎమ్మెల్యే
  • అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదంటున్న కౌన్సిలర్లు
  • వైస్ చైర్మన్ అవినీతి ఇంతింత కాదయా అంటున్న సొంత పార్టీ కౌన్సిలర్లు
  • హుజూర్ నగర్ బీ ఆర్ఎస్ లో ఎమ్మెల్యే వర్సెస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి బీ ఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు నియంతృత్వ పోకడలను నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవిశ్వాస తీర్మానం వద్దని ఎమ్మెల్యే సైదిరెడ్డి చెబుతున్నప్పటికీ అలా జరిగే పక్షంలో మూకుమ్మడిగా పార్టీకి సైతం రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు

ఉత్సవ విగ్రహాలుగా ఇంకెన్నాళ్లు

 హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఎమ్మెల్యే సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని సంపత్ రెడ్డి జక్కుల వీరయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ప్రస్తుత ఉన్న కౌన్సిలర్లలో 16 మంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏడుగురు కూడా అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేశారు దీంతో ఒకరిద్దరి మిన హా మొత్తం కౌన్సిల్ సభ్యులందరూ కూడా వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పదవి నుంచి దించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వీరికి మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లి అర్చన రవి ఆమె భర్త గేల్లి రవి మద్దతు కూడా ఉండడంతో అవిశ్వాసాన్ని ఆపడం ఎవరి తరము కాదని దీమాతో కౌన్సిలర్లు ముందుకు వెళ్తున్నారు హుజూర్ నగర్ లో జరిగే ప్రతి పనిలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఇంకెన్నాళ్లు ఉండాలని ఎదురు దాడి తప్పదని కౌన్సిలర్లు అందరూ ఒక్కటే వైస్ చైర్మన్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే పై బాటంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వైస్ చైర్మన్ కి ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నాడని మున్సిపాలిటీలో ఎన్నో అక్రమాలకు వైస్ చైర్మన్ తెరలేపి భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు సొంత పార్టీ కౌన్సిలర్లే ఆరోపించడం అందుకు తగిన ఆధారాలు చూపించడం విశేషం.

అవిశ్వాసానికి సిద్ధపడ్డ వారితో మాట్లాడడానికి విముఖత చూపుతున్న ఎమ్మెల్యే

 అయితే అవిశ్వాసానికి తెరలేపిన కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపేది లేదని ఎమ్మెల్యే భీష్మించుకు కూర్చున్నట్టు సమాచారం అంతేకాకుండా విశ్వాసానికి మూలకారకులైన వీర్లపాటి గాయత్రి భాస్కర్ అమరబోయిన సతీష్ జక్కుల శంభ య్య లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఎమ్మెల్యే రంగ సిద్ధం చేసినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో కౌన్సిలర్లు అందరు కూడా అవసరమైతే అవిశ్వాసాన్ని కాదంటే పార్టీ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డట్టు తెలిసింది. టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి కూడా అవిశ్వాస తీర్మానాన్ని చేసుకోవాలని కౌన్సిలర్లకు చెప్పినట్టు తెలిసింది ఈ నోటా ఆ నోట కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రచారమైన హుజూర్నగర్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం విషయం మంత్రి కేటీఆర్ కి కూడా స్థానిక నాయకులు చేరవేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైస్ చైర్మన్ పై ఆరోపణలు ఇవే 

కోదాడ రోడ్డు లోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఆనుకొని ప్రైవేటు వాళ్లు వెంచర్ వేశారు ఈ వెంచర్ గుండా హుజూర్నగర్ నుంచి జాతీయ రహదారి వెళుతుండడంతో నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఈ వెంచరులో గజానికి 4500 నష్టపరిహారం చెల్లిస్తుండగా అందులో ప్రభుత్వ భూమి రెండు వేల గజాలకు వైస్ చైర్మన్ నష్ట పరిహారం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీ పి  అర్ లే అవుట్ కు సంబంధించి 2700 గజాల భూమికి సంబంధించి మూడు కోట్ల విలువైన డాక్యుమెంట్ ని కూడా మాయం చేసి యజమానికి వైస్ చైర్మన్ అందించినట్టు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 28 వార్డులకు పెంచడంతో సిబ్బంది అవసరమని చైర్ పర్సన్ తీర్మానించగా దీనిని వ్యతిరేకించిన వైస్ చైర్మన్ రాత్రికి రాత్రి పలుకుబడి ఉపయోగించి కమిషనర్ను బదిలీ  చేయించినట్టు విమర్శలు ఉన్నాయి ఇటీవల హుజూర్నగర్ లో వెలసిన 50 ఎకరాలకు సంబంధించి అక్రమ వెంచర్లకు సహకరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి ఉర చెరువు వాగును కబ్జా చేసిన వ్యక్తులకు సహకరించి వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా వైస్ చైర్మన్ ఒత్తిడి తెచ్చారని హుజూర్ నగర్ లో  వివాదాస్పద స్థలం కు సంబంధించి చైర్ పర్సన్ కు తెలియకుండా నెంబర్లు ఇప్పించినట్టు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు

అదనపు కలెక్టర్కు అవిశ్వాసపు నోటీసు అవిశ్వాసం నెగ్గకుంటే మంత్రి జగదీష్ రెడ్డికి ఫిర్యాదు లేదంటే రాజీనామా

వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడలను అవినీతిని నిరసిస్తూ ఇటీవల సూర్యాపేట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసును అందించారు అవసరమైతే ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఫిర్యాదు చేస్తామని కౌన్సిలర్లు పేర్కొనడం గమనార్హం . లేదంటే అన్ని దారులు మూసుకుపోయినా 
తా మంతా రాజీనామా కూడా సిద్ధపడ్డట్టు కౌన్సిలర్లు పేర్కొన్నట్టు సమాచారం. అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లకు చైర్పర్సన్ మద్దతుగా నిలిచినట్టు అవసరమైతే చైర్ పర్సన్ అర్చనతోపాటు ఆమె భర్త రవి కూడా కౌన్సిలర్లకు మద్దతుగా రాజీనామా సిద్ధపడ్డట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తీర్మానం ఏమవుతుందో వేచి చూడాల్సిందే.