మణిపూర్ ఘటన దోషులను తక్షణమే ఉరితీయాలి 

మణిపూర్ ఘటన దోషులను తక్షణమే ఉరితీయాలి 

  • జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి-దేవరం మల్లేశ్వరి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:మణిపూర్ ఘటన దోషులను తక్షణమే ఉరితీయాలని జాతీయ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని మట్టపల్లి బైపాస్ రోడ్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్య సమాజంలో ఇద్దరు మహిళలని వివస్థలను చేసి ఊరేగించి అత్యాచారం జరిపిన నిందితులని ఉరి శిక్ష వేయకపోతే రాబోయే కాలంలో మరెన్నో ఘోరాలను చూడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిందితులకుకు బుద్ధి చెప్పాలంటే వెంటనే ఉరితీయాలని, ఈ సృష్టి లయలకు మూలం స్త్రీ అని ,స్త్రీ జాతిని అవమానించినందుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు కాసే పిచ్చమ్మ, సోమగారి లక్ష్మమ్మ, పాలకూరి మమత, సిగరం పుల్లమ్మ, రేష్మి, పద్మ పాల్గొన్నారు.