సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి.

శ్రీ సీతారామ, లక్ష్మణ,ఆంజనేయ,గణపతి,  విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  అన్నారు. గురువారం నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో లాల్ లక్ష్మీపురం లో  నూతనంగా నిర్మించిన రామాలయంలో  శ్రీ సీతారామ,లక్ష్మణ,ఆంజనేయ,గణపతి,  విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం పాలకీడు మండలం నాగిరెడ్డి గూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమన్నిఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతనే  దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నాయి అని అన్నారు. గ్రామ ప్రజలు కూడా  ఆలయాలకు దానధర్మాలు చేయడం మహాభాగ్యం అన్నారు. ఆలయాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలన్నారు. సమాజంలో మానవ సంబంధాలు నైతిక విలువలు ఆలయాల పరిరక్షణతోనే పెంపొందుతాయి అన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. అనంతరం దేవాలయం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో సర్పంచ్ పల్లె పంగు నాగరాజు బిఆర్ఎస్ నాయకులు చలసాని మాధవరావు కొంజేటి కరుణాకర్ రావు మేకపోతుల నాగరాజు ఎంపీటీసీ నందిపాటి నాగవేని గురువయ్య, మాజీ సర్పంచ్ మేకపోతుల శ్రీనివాస్ అనంతు రాంబాబు  అనంతు నాగరాజు కటికొల నాగయ్య. అనంతు అంజయ్య కట్టికొల వేంకటేశ్వర్లు 
 ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు పాల్గొన్నారు.