రాళ్లు, మట్టి తేలిన బాటల్లో బతుకుకు గ్యారంటీ లేదు

రాళ్లు, మట్టి తేలిన బాటల్లో బతుకుకు గ్యారంటీ లేదు

మా ఊరికి మంచి రోడ్డు వేయరూ...!

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో నోచుకోని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాకున్నా నమ్మక తప్పదు మరి ఏటేటా పాలకులు  మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు ప్రజాప్రతినిధులు తమ పబ్బం గడుపుకుంటున్నారుగ్రామస్తులు ఆవేదనను గాలికి వదిలేశారు అయితే గ్రామానికి మాత్రం ఒక మంచి రోడ్డు వేయడానికి ఆలోచన ఎవరికీ రాలేదు ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఆ పల్లె వాసులకు నిరాశ మిగిలింది ఇది ఎక్కడో దూరంగా జరిగిన సంఘటన కాదు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి సమీపంలో రోడ్డు సౌకర్యానికి నోచుకోలేని ఓ గ్రామ కథ చెవ్వూరిగూడెం గ్రామస్తుల తీరని వ్యధ. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంపై ముద్ర ప్రత్యేక కథనం

ఏదేని అత్యవసర పనిమీద అర్జెంటుగా వెళ్లాలంటే ఆ గతుకుల రోడ్డు దిక్కు వాహనాలు ఖరాబ్ కావడం ఎత్తేసి దిగేసి శరీరం గొల్ల కావడం ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఒళ్లంతా హునమైపోవడం ఆ గ్రామస్తులకు రివాజుగా మారింది తప్పని పరిస్థితుల్లో గ్రామస్తులు కూడా అలాంటి కష్టాలకు అలవాటు పడక చేసేది ఏమీ లేక నిరాశ  నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారుసూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం చెవ్వొరిగూడెం  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు ఆ గ్రామానికి మట్టి రోడ్డు కూడా సక్రమంగా లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న వేళ తమ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేదని,  మరింత అద్వాన్నంగా తయారైందని ఆరోపిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తో పాటు గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగిన ఘటన గురువారం జరిగింది.ఇప్పటికైనా పాలకులు కరుణిస్తారా అధికారుల తీరు మారుతుందా రోడ్డు సౌకర్యం కల్పిస్తారా గ్రామస్తుల కష్టాలకు శుభం కార్డు పడనుందా అన్నది వేచి చూడాల్సిందే