మొదటి సారిగా ఖిలాపై మువ్వెన్నెల జెండా: ఎగురవేసిన ఎమ్మెల్యే డా. రోహిత్

మొదటి సారిగా ఖిలాపై మువ్వెన్నెల జెండా: ఎగురవేసిన ఎమ్మెల్యే డా. రోహిత్

మెదక్ ప్రజలు హర్షం
ముద్ర ప్రతినిధి, మెదక్: చారిత్రాత్మక  మెదక్ ఖిలాలై మొదటిసారిగా జాతీయ జెండా ఎగిరింది. రాచవీడుగా పెర్కొనబడే మెదక్ రాచవీడు ఖిలాపై ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ 75వ గణతంత్ర్య దినోత్సవం పురస్కరించుకోని జాతీయ పతాకాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంత వాసులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


క్యాంపు కార్యాలయంలో...
75వ గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే  డా. మైనంపల్లి రోహిత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రోహిత్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితం నేటి గణతంత్ర్య దినోత్సవం  అన్నారు. అనంతరం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జాతీయ పథాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావ్, బొజ్జ పవన్, ఉప్పల రాజేష్, కౌన్సిలర్ దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, ఆవారి శేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, నాయకులు గూడూరి అరవింద్, మాజీ కౌన్సిలర్ లు మున్నా, ఎస్.డి. జ్యోతి క్రిష్ణ, బట్టి సులోచన, హరిత, లల్లూ, డిజె రితీష్, మైసన్, సంగమేశ్వర్, పరుశురాం, పోచేందర్, భూపతి, జిలకరి రాజలింగం, ఇస్మాయిల్, మంగమోహన్ గౌడ్, చంద్రబోస్, సూపి, జాయ్ ముర్రె, సయ్యద్ మున్నా, మంగరాజు, గాడి రమేశ్ తదితరులు పాల్గోన్నారు.